SAKSHITHA NEWS

ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం ఫోకస్ !

అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల యాప్

  • ప్రజాపాలనలో వచ్చిన డబుల్ బెడ్ రూమ్ అప్లికేషన్ లను ఆదివారం రాత్రికి ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో అప్ లోడ్ చేస్తారు.
  • ఆయా ప్రాంతాల సెక్రటరీలు వీటి ఆధారంగా అప్లికేషన్ ను వెరిఫై చేయనున్నారు.
  • దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించనున్నారు.
  • సొంత ఇంట్లో ఉంటున్నారా? కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారా? వంటి వాటికి సంబంధించి యాప్ లో 30కాలమ్స్ ను సెక్రటరీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • అలాగే ఆధార్, మొబైల్, రేషన్ కార్డ్ నంబర్, ఫోటో, యాప్ లో అప్ లోడ్ చేయాలి.
  • “ఇందిరమ్మ ఇండ్లు” మొదటి విడతలో ఖాళీజాగ ఉన్నవారికి ప్రియారిటీ ఇస్తుండడంతో.. యాప్ లో సొంత ఖాళీజాగా ఫొటోను సెక్రటరీలు తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.‌ తద్వారా ఆ స్థలం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆన్లైన్ లో ఎంట్రీ కానున్నాయి.
  • ఈ జాగా చుట్టూ తూర్పు,పడమర,ఉత్తరం,దక్షిణం వైపు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనే వివరాలు కూడా ఆన్లైన్ లో ఎంట్రీ అవుతాయి.
  • స్కీమ్ కింద బేస్ మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా మొత్తం 4విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి.
  • ఈ నాలుగు దశల్లో ప్రతీ దశకు సంబంధించిన ఫోటోను యాప్ లో అప్ లోడ్ చేస్తేనే పేమెంట్ మంజూరు అవుతుంది. ఫోటోలు అప్ లోడ్ చేయకుంటే బ్రేక్ పడుతుంది.
  • అలాగే ఒకచోట మంజూరు వచ్చి.. మరోచోట నిర్మాణం చేపట్టినా ల్యాంగిట్యూడ్, లాటిట్యూడ్ లు మారి పేమెంట్ కావు.
    యాప్ ద్వారా కరెక్షన్స్
  • ప్రజాపాలనలో ఇండ్ల కోసం చేసుకున్న అప్లికేషన్స్ లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా కల్పించింది. ఆధార్, ఫోన్, రేషన్ కార్డ్ నంబర్లు తప్పుగా పడిఉంటే.. వెరిఫికేషన్ లో భాగంగా ఇంటికి వచ్చే పంచాయతీ సెక్రటరీలకు ఒరిజినల్ కాపీలు చూపించి వాటిని సరిచేసుకోవచ్చు. ఇంటిపేరు దరఖాస్తుదారుడి పేరు తప్పుగా నమోదైతే ఆధార్ ఆధారంగా పేర్లు, ఇంటిపేరు యాప్ లో కరెక్షన్స్ చేసుకోవచ్చు


SAKSHITHA NEWS