
ప్రభుత్వ చీఫ్ విప్ శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, MLA కేపీ వివేకానంద గౌడ్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి , కమీషనర్ సాబేర్ అలి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , మేడ్చల్-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా భవ్యాస్ ఆనందం అపార్ట్మెంట్స్ నుండి హిల్ కౌంటీ వరకు మూడు బిట్ల రోడ్ డివైడర్స్, హిల్ కౌంటీ నుండి రాజీవ్ గాంధీ నగర్ వరకు రెండు బిట్ల డివైడర్స్,15,16&20 డివిజన్ల పరిధిలో జయదీపిక నుండి పూజిత ఎంక్లేవ్ వరకు కుడి,ఎడమ వైపు సీసీ రోడ్డు,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద బీటీ రోడ్, అండర్ మున్సిపల్ ఫండ్స్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ 2,3,4,5,6, 22, 23, 24&25 డివిజన్ల సంబంధిత బీటీ రోడ్,2వ డివిజన్ పరిధిలో ప్రగతి నగర్ కమాన్ నుండి లోహిత అపార్ట్మెంట్ వయా శ్రీ కృష్ణ కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NMC కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, NMC ఆయ విభాగాల అధికారులు, మరియు సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
