SAKSHITHA NEWS

రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


SAKSHITHA NEWS