SAKSHITHA NEWS

తెలంగాణ మహిళ సంఘాలకు గుడ్ న్యూస్ #

రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేయనుంది.

అభయ హస్తం పథకం కింద 2009 నుంచి 2016 వరకు మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని రేవంత్ ప్రభుత్వ నిర్ణయించింది.

గ్రామాల వారీగా లబ్దిదారుల లిస్టును రెడీ చేస్తోంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు 500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీం తీసుకువచ్చారు. అయితే 2018లో ఈ పథకం నిలిచిపోయింది.

దీంతో అభయహస్తం స్కీంలో కట్టిన డబ్బులను వడ్డీతో సహా మహిళా సంఘాల సభ్యులకు తిరిగి ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app