SAKSHITHA NEWS

గరంగరంగా గ్రామసభలు

జాబితాల్లో అనర్హుల పేర్లు ఉన్నాయని అధికారులతో ప్రజల వాగ్వాదం

అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : రైతు భరోసా. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను గుర్తించేందుకు నాల్గవ రోజు నిర్వహించిన గ్రామ సభలు గరంగరంగా సాగాయి. అధికారులు వెల్లడించిన జాబితాల్లో అనర్హుల పేర్లు ఉండడంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హు లకు అన్యాయం జరుగుతోందని మండిప డ్డారు. మండలంలోని టేకుమట్లలో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని, అర్హుల పేర్లు లేకపోవడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్వే సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో నిర్వ హించిన గ్రామసభలో ఆర్డీవో వేణుమాధవ్, ఎమ్మార్వో శ్యాంసుందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app