0 0
Spread the love

Read Time:3 Minute, 21 Second
గంగమ్మ ఆశీస్సులు అందుకున్న తిరుపతి నగరపాలక సంస్థ
తిరుపతి
తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగ మూడవ రోజు మొదటి సారి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కమిషనర్ అనుపమ అంజలి నిర్వహణలో, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సారధ్యంలో, మేయర్ డాక్టర్ శిరీషా ముఖ్య అతిథిగా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి పర్యవేక్షణలో గంగమ్మకు సారేను ఊరేగింపుగా తీసుకెల్లి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మొదటిసారి అమ్మవారికి సారేను అందిస్తూ, వేషాలు వేసుకొని ఊరేగింపుగా రావడం శుభ పరిణామమన్నారు. మేయర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థ నుండి 15 లక్షలు అందించడంతోబాటు, మొదటిసారి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కార్మికులు వేషాలతో నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కళాకారులతో ఊరేగింపుగా నడిచివచ్చి అమ్మవారికి సారే సమర్పించడం అదృష్టమన్నారు. సారే ఊరేగింపులో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, లోకేష్ వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహాచారి, నరేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మెన్ తొండమనాటి వెంకటేష్ రెడ్డి డప్పులకు తగిన నృత్యాలు చేస్తూ ఊరేగింపులో ఆశాంతం ఉత్సహం నింపారు. ఊరేగింపుగా సారేతో వచ్చిన వారికి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ఆలయ చైర్మెన్ కట్టా గోఫి యాదవ్, ఈఓ మునికృష్ణయ్య స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈలు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దేవిక, గోమతి, రవింధ్ర రెడ్డి, ఆర్.ఎఫ్.ఓ జ్ఞాన సుందరం, మేనేజర్ చిట్టిబాబు, గాలి సుధాకర్, చెంచెయ్య, సుమతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
You cannot copy content of this page