
వేద స్కూల్లో గాంధీ వర్ధంతి కార్యక్రమం
చిలకలూరిపేట స్థానిక వేద స్కూల్లో గాంధీ వర్ధంతిని నిరాడంబర వాతావరణంలో నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల అసెంబ్లీ కార్యక్రమంలో గాంధీజీ యొక్క నిరాడంబర జీవితాన్ని జాతి సమైక్యతకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క అంతిమ శ్వాస ఏ విధంగాఅర్పించా రో చూపించిన సన్నివేశము ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమా లు ఏర్పాటు చేశారు. అలాగే ఐక్యమత్యమే మహాబలం అనే దానిని అర్థమయ్యేటట్లుగా చేసిన అభినయం విద్యార్థులందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గిరి పెర్సీ స్వరూప విద్యార్థిని విద్యార్థులకు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ యొక్క నిరాడంబర జీవితాన్ని త్యాగశీల నడవడికను ,సత్యము ,శాంతి ,అహింస అనే మార్గములో మనకు స్వాతంత్ర్య సముపార్జన చేసినటువంటి జాతిపిత మన గాంధీ. ఆయన అడుగుజాడలలో నడవడమే గాంధీ మహాత్మునికి ఘనమైన నివాళి అని తెలిపారు.
అలాగే పాఠశాల అకడమిక్ డైరెక్టర్ సత్య దీప్తి గాంధీ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు జాతీయతాభావన,జాతిసమైక్యత ,సహజీవనము, కులమత వర్ణ భేదము లేనటువంటిసమాజమునుస్థాపించుటకు గాంధీజీ చూపిన మార్గము ఆచరణ యోగ్యము ,వారి ఆశయాలలో నడుచుకోవడమే విద్యార్థుల యొక్క తక్షణ కర్తవ్యం. వారి జీవితము మనకు ఆదర్శప్రాయం అని తెలిపారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ సునీత విద్యార్థులలో జాతీయ నాయకుల ఆదర్శ భావాలు మనందరికీ శిరోధార్యం. గాంధీ మహాత్ముని నిస్వార్ధ సేవ ,పరోపకార శీలము, కుల మత భేదాలు లేని సమాజ స్థాపన స్థాపన కోసము వారు మనందరిలో ఐక్యత భావమును కలిగించిన మహానుభావుడు మహాత్మా గాంధీజీ. అందుకే వారి మార్గాన్ని అనుసరించడమే ప్రపంచశాంతికి కారణభూతము. దేశ విభజన తర్వాత కూడా ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని అతని ఆకాంక్ష, మనందరిలో స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అప్పుడే సమ సమాజ స్థాపనసాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సునీత వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి కోఆర్డినేటర్ రోహిణి సాంఘిక ఉపాధ్యాయులు నాగ మల్లేశ్వర రావు హఫీజ్ మరియు తెలుగు ఉపాధ్యాయులు పార్థసారథి ,గోపి కృష్ణారెడ్డి, మనోహర్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app