SAKSHITHA NEWS

ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు

హైదరాబాద్:
తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గర కానున్నాయి వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపో తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించనుంది.

మీసేవ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీసేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ తో.. ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు.

ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలను పొందే అవకాశం కల్పించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా ప్రజలు పౌరసేవలు అందిస్తారు.

ఇదిలా ఉంటే మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసు లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, వీటితోపాటు..

పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొల గింపు, తరలించేందుకు అనుమతులు వంటి సేవలన్నీ స్మార్ట్ ఫోన్ లోనే పొందొచ్చు. దీంతో ప్రజలు ఇకపై పనుల గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు


SAKSHITHA NEWS