ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావాలు

Spread the love

ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావాలు
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి

వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి

ఐక్యతకు ప్రతీక లు ఫ్రీడమ్ రన్ లు

నాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వే ఫ్రీడమ్ రన్ లు

*ఫ్రీడమ్ రన్ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ *

సాక్షిత : ఫ్రీడమ్ రాన్ తో ప్రజల్లో జాతీయ భావాలు పెన్ పొందుతాయని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఫ్రీడం రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ….. నాడు స్వతంత్ర ఉద్యమం లో స్ఫూర్తిని రగిలించిన డానికి ఫ్రీడమ్ రన్ లు కీలక పాత్ర వహించాయన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రెండు వారాల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వజ్రోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు ఐయే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం క్రాస్ రోడ్ నుండి రంగా థియేటర్ వరకు ఆయన రన్లో పరిగెత్తుతూ యువతను హుషారెత్తించారు. అదేవిధంగా కేఎల్ఆర్ నుండి వై జంక్షన్ వరకు ఫ్రీడమ్ రాన్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్ కుమార్,డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్ శర్మ, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ఖదీర్, గుండెల సూర్యనారాయణ, మైస రమేష్, కోట మధుసూదన్, ఒంటి పులి రమ శ్రీనివాస్, కట్టబోయిన జ్యోతి శ్రీనివాస,కామినేని ప్రమీల, కందుల చంద్రశేఖర్, మామిడి పద్మ, చందర్రావు, షఫీ, బెజవాడ శిరీష శ్రవణ్, లలిత, ,కాజా,సాదిక్, డాక్టర్ బ్రహ్మం, అపర్ణ వెంకట్, జానకి ఏసయ్య, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, మహిళ నాయకురాలు రోజా రమణి, గ్రంధాలయ చైర్మన్ రహీం మైనార్టీ నాయకులు తాజ్, చింతల నాగేశ్వరావు, కాళిదాసు వెంకటరత్నం,బత్తుల ఉపేందర్,వంశీ, తిరుమలగిరి రాధాకృష్ణ, పాండు, లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page