
కైసర్ నగర్” లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ నందు 22 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… గత 11 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మరిన్ని నిధులు వెచ్చించి అభివృద్ది పరుస్తామని తెలియజేశారు. అంతకముందు స్థానికంగా గల హనుమాన్ దేవాలయం నందు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గాజుల రామారం పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా వారికి ఎమ్మెల్యే శాలువా కప్పి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, మూసా ఖాన్, చెట్ల వెంకటేష్, సమ్మయ్య యాదవ్, చిన్న చౌదరి, బోయిని మహేష్, ఇమ్రాన్ బేగ్, హమీద్, మసూద్, ఆతీఫ్, సాయిబాబా, అజయ్, నయీం, శివ నాయక్, ఆసిఫ్, ప్రసాద్, సౌండ్ శేఖర్, చంద్రశేఖర్ గౌడ్, సాయి చంద్, మహిళా నాయకురాలు మామి, కైసర్ నగర్
కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app