SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఉయ్యూరు మాజీ సర్పంచ్ శ్రీమతి భ్రమరాంబ కుమార్తె నిశ్చయ తాంబూలాల కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .

ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ స్వగృహంలో ఏర్పాటుచేసిన ఆయన చిన్న కుమార్తె నిశ్చయతాంబూలాల కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు” .

ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడు కాబోయే వధూవరులు డా,, స్నేహ మరియు రాజేష్ కు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేసి _రాజేంద్ర ప్రసాద్ మరియు పొట్లూరి రమేష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి ఇంటి లోపలికి వచ్చి కాసేపు ఇరు కుటుంబ సభ్యులతో ముచ్చటించినారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి , మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు , ఎమ్మెల్యేలు సుజనా చౌదరి , మండలి బుద్ధ ప్రసాద్ , యార్లగడ్డ వెంకట్రావు , కాగిత ప్రసాద్ , సిద్ధార్థ అకాడమి సెక్రటరీ పాలడుగు లక్మణరావు , విజయ డెయిరీ మిల్క్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు , ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ , జయ మంగళ వెంకటరమణ , మాజీ ఎమ్మెల్యే అన్నే విజయలక్ష్మి , పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య , మరియు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనీ కాబోయే వధూవరులను ఆశీర్వదించినారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app