
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో డా||. మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పుల మల వేసి తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావని ఆయన సేవలను గుర్తుకు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదని పేర్కొన్నారు.
నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, డా.ఆవిజే జేమ్స్, 129 డివిజన్ మాజీ కార్పొరేటర్ పాల కృష్ణ, బహదురుపల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, సిద్దనోల సంజీవ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, గణేష్, బుయ్యని శివ, సోమన్నాగారి శ్రీధర్ రెడ్డి, పండరి రావు, ఎండీ లాయక్, సంతోష్ ముదిరాజ్, కొలన్ జీవన్ రెడ్డి, ప్రసాద్, నాగి రెడ్డి, హారి, నాగరాజు, ఉస్మాన్, పిల్లి ఆంజనేయులు, రంగయ్య, షఫీ, భాస్కర్ రెడ్డి, కరణ్, తులసి, అరుణ, శ్యామల తదితరులు పాల్గొన్నారు
