SAKSHITHA NEWS

జీవితకాలం రాజకీయం చేయడానికి వనపర్తి నియోజకవర్గ నీ జాగీరు కాదు*ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పై విరుచుకుపడ్డ ………….గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి

సాక్షిత వనపర్తి ఫిబ్రవరి 24
మంది తిండి తినే నీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు

వనపర్తి నియోజకవర్గం నీ జాగిరి కాదు

నిన్ను నమ్ముకున్న నాయకులందరూ ఆస్తులు కోల్పోయారు.
నీవు మాత్రం వందల ఎకరాలు సంపాదించుకున్నావు

జీవితకాలం రాజకీయం చేసేందుకు వనపర్తి నియోజకవర్గం మీ జాగీరు కాదని, 40 ఏళ్ల రాజకీయంలో నేడు కొత్త వ్యక్తులకు అవకాశం వస్తే చూసి ఓర్వలేక ఆపసోపాలు పడుతున్నావని గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పై విరుచుకుపడ్డారు

వనపర్తి పట్టణం తరుణి ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు

శవాలపై చిల్లర ఏరుకునేతినే సత్యశీలా రెడ్డికీ రాజకీయ బిక్ష పెట్టానని విమర్శించడం పై ఆమే తీర్వ స్థాయిలో ధ్వజమెత్తారు

తనకు తన భర్తకు భగవంతుడు కృపతో రాజకీయ పదవులు లభించాయే తప్ప నీలాంటి వ్యక్తుల వల్ల కాదని…

మాలాంటి ఎంతోమంది కష్టపడితేనే నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అనుభవించావే తప్ప పార్టీ కోసం కష్టపడిన వారిని ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు

నేటికీ నా సొంత గ్రామం పొలికే పహాడ్ లో ఎంతోమందికి అన్నం పెడుతున్నానని నువ్వు నీ సొంత గ్రామం తిరుమలాపురంలో ఒక్కరికైనా భోజనం పెట్టావా అని ప్రశ్నించారు

వెంట ఉన్న కార్యకర్తలకు కనీసం మంచి నీళ్లు ఇవ్వని కుసంస్కారివి నువ్వని, మంది ఇంట్లో రొట్టెలు చేస్తే తినే నీకు మా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు

పోల్కే పహాడ్ లో ఏకగ్రీవం చేసిన అన్నావే అది నా గ్రామ ప్రజల దీవెన తప్ప నీ గొప్పతనం లేదని ఆమే అన్నారు

నువ్వు మా ఊరిలో ఏకగ్రీవం చేయడం కాదు నీ తిరుమలపురంలో ఏకగ్రీవం చేసి నీ విజ్ఞతను నిరూపించుకోవాలని ఆమె సవాల్ విసిరారు

ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసే వ్యక్తులకు పదవులు దక్కవు కాని నీ కుమారుడికి పదవులు ఏ విధంగా కట్టబెడుతున్నారో చెప్పాలన్నారు

నీ కుమారుడి కంటే సీనియర్లు పార్టీ కోసం పని చేసిన వారు ఎవరు మీకు కనబడరా…? అని ఆమె ప్రశ్నించారు

ప్రస్తుత వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేఘరెడ్డి కేవలం 14 నెలల్లో 850 కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకువచ్చారని

నీలాగా ఆయనకు మంత్రి పదవులు దక్కితే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని ఓర్వలేక నేడు ఆయన అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆమె దుయ్యబట్టారు

నడవ చేతగాని 70 ఏళ్ల నువ్వు నాయకులను కార్యకర్తలను సర్వనాశనం చేసి నేడు పదవులు అనుభవించడం నీ స్వార్థ రాజకీయానికి ఓ తార్కానమన్నారు

ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిలో పోటీపడి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేదేందుకు సహకారం అందిస్తే బాగుంటుందని, అప్పుడే నిన్ను నియోజకవర్గ ప్రజలు అభిమానిస్తారు ప్రేమిస్తారని ఆమె సూచించారు

మరోసారి నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app