SAKSHITHA NEWS

మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కు ఘనసన్మానం…

•ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానించిన191 ఎన్టీఆర్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు & కాలనీ వాసులు

మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ లని నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యలు & కాలనీ వాసులుతో
కలిసి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి,బహుమతులను బహుకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రత్యేకంగా 7వ డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అదే విధంగా తమకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన 7వ డివిజన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లపుడూ ప్రజలలో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మొదటి నుండి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేశామని అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు,స్థానిక డివిజన్ నాయకులకు, సంక్షేమ సంఘాల సభ్యలకు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 191ఎన్టీఆర్ నగర్ నూతన ప్రెసిడెంట్ రాజేష్ రామ్, వైస్ ప్రెసిడెంట్ లు పవన్, నర్సింహా నాయక్, దత్తు, అచ్చుత్, జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కె.వి మోహన్, జాయింట్ సెక్రటరీ లు ఉపేందర్,నర్సింహా, మాజీ ప్రెసిడెంట్ కృష్ణ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app