
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు పిడుగురాళ్ల లో ఘన స్వాగతం
హైదరాబాద్/ పిడుగురాళ్ల.. ఆర్యవైశ్యులు సేవా రంగము, రాజకీయ రంగము లోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని అందరికీ ఆదర్శంగా నిలబడాలని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు ,, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉప్పల పౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ప్రచార కమిటీ రాష్ట్ర కో చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు, మరియు వారి తనయుడు ఉప్పల ఫౌండేషన్ కో చైర్మన్ కు ఉప్పల సాయి తేజ గుప్తా కు గురువారం ఉదయం పిడుగురాళ్లలో ఘన స్వాగతం లభించినది. ఒంగోలులో జరుగు మీటింగ్ కి వెళుతూ మార్గమధ్యలో పిడుగురాళ్లలో ఆగిన వారిని పట్టణ ప్రముఖులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయిలో పట్టణ ప్రముఖులు ఎన్నో పదవులు చేపట్టారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్ట్ జాతీయ కోశాధికారి డాక్టర్ జూలకంటి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ APEWIDC రాష్ట్ర మాజీ డైరెక్టర్ చింతా వెంకట రామారావు, ఆర్య వైశ్య యువ నాయకులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం కార్యదర్శి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ పంతంగి అమర్, ఆర్యవైశ్య సీనియర్ నాయకులు మద్దాలి శివ, పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి ఆలేటి కనకయ్య, ఆర్యవైశ్య నాయకులు దేవరపల్లి కృష్ణ ప్రసాద్, ఆర్య వైశ్య యువ నాయకులు కోటా బుచ్చిబాబు ఇతర ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
