
కూకట్పల్లి నియోజకవర్గం లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించుకోవడం జరిగింది.
దామోదర్ రాజనర్సింహ మంత్రి గారు కచ్చితంగా ఆస్పత్రి ఏర్పాటు గురించి తొందర్లోనే కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు మంచి శుభవార్త వింటారని హామీ ఇచ్చారు..
కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ప్రజలను ప్రజల ఇబ్బందులను పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం.. అందుకే ప్రజలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడ గొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కచ్చితంగా అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని గంటాపదంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బి సంజీవరావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ గోపిశెట్టి రాఘవేందర్, మేకల మైకెల్, కోఆర్డినేటర్ తూము సంతోష్ కుమార్, దేవ సహాయం రవి, డివిజన్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, kkp ఎస్సీ సెల్ బండిగ నరసింహ, కొమ్ము బాబురావు, రాజు ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app