చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం

Spread the love

Food donation to Ayyappa Swami at Chaudammagutta Hanuman Temple

చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం

– అన్నదానం చేసిన ఎస్ఏసి ఈవెంట్స్ నిర్వాహకులు వినోద్
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మగుట్ట హనుమాన్ దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు అయప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని షాద్ నగర్ కు చెందిన ఎస్ ఎ సి ఈవెంట్స్ వినోద్ చేశారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుబ్రహ్మ శ్రీశ్రీశ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటరామిరెడ్డి, అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పులిమామిడి శ్రీశైలం గౌడ్, పినపాక ప్రభాకర్, గురుస్వామి బాబు, బాల్ రెడ్డి, అశోక్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page