SAKSHITHA NEWS

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

సాక్షిత చిలకలూరిపేట

చిలకలూరిపేట నియోజకవర్గ, పట్టణ అభివృద్ధికి కూటమి అభ్యర్థి గెలుపు అనివార్యం

మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేట: ఈనెల 27వ తేదీ జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ రఫాని కోరారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఫానీ మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అదికంగా కృషి చేస్తున్నారని ఈకోవలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థి అయినా ఆలపాటి రాజా గెలిస్తే చిలకలూరిపేట సర్వత ముఖాభివృద్ధి చెందుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.

చిలకలూరిపేట పట్టణ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అమృత్ పథకానికి నిధులు సమకూర్చే విషయంలో కృషి చేస్తున్నారని వెల్లడించారు. అపరిష్కృతంగా ఉన్న ఆటోనగర్ సమస్య త్వరలోనే పరిష్కారం కావునన్నదని వెల్లడించారు. టిట్కో గృహ సముదాయంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లను కేటాయించనున్నారని వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలో పారిశుధ్యం తాగునీటి సమస్య రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కృషి చేస్తున్నారని చెప్పారు.

నిరుద్యోగ యువత కోసం కూటమి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదని వారికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. విజ్ఞత గల ఓటర్లు ఆలోచించి తమ ప్రధమ ప్రాధాన్యత ఓటును అలపాటి రాజేంద్రప్రసాద్ కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app