ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు మగ్గం పని పై శిక్షణ కార్యక్రమం
సాక్షిత సైదాపూర్ కరీంనగర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2018 19 సంవత్సరము లో వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలలోని మహిళలకు మగ్గం పనిపై ఉన్నతి పథకం నందు మగ్గం పై శిక్షణ కార్యక్రమం సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ శిక్షణ కార్యక్రమానికి గ్రామంలోని 35 మంది మహిళలు పాల్గొంటు మగ్గం పనిపై మెలికలు నేర్చుకొని ఆర్థికంగా ఎదగాలని పూర్తిస్థాయిలో మగ్గం పని నేర్చుకున్న వారికి తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు రుణాలు ఇప్పించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి తెలియజేశారు ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు శిక్షణ సమయంలో మహిళలకు మధ్యాహ్న భోజనంతో పాటు
రెండుసార్లు టీ అందించబడుతుంది అని తెలిపినారు మగ్గం పని పై శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్ ప్రశాంతి మేడం మహిళలు పాల్గొన్నారు

