SAKSHITHA NEWS

విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం KGR ఫార్మసీ కాలేజీ నందు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా ఎమ్మెల్యే “బత్తుల” ఓట్లు అభ్యర్థన…

పట్టభద్రులందరూ సమిష్టిగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి పేరాబత్తుల రాజశేఖరం ని అఖండ మెజారిటీతో గెలిపించాలని వినతి…

మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖరం కి వేసి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపు.

ఉన్నతుడు విద్యావంతుడు మేధావి అయిన పేరాబత్తుల రాజశేఖరం ని గెలిపిస్తే శాసనమండలిలో తన గళం వినిపించి అందరి సమస్యలు తీరుస్తాడని వివరణ…

రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేశారు. ఇందులో భాగంగా నేడు కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం KGR ఫార్మసీ కాలేజీలోని విద్యావంతులను కలిసి రేపు 27 న జరిగే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును విద్యావంతుడు, విధేయుడు, సమస్యలపై అవగాహన కలిగి ప్రజాగళం వినిపించి ప్రజా సమస్యలను తీర్చగలిగే ఎన్డీఏ కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రాభివృద్ధిలో అలానే మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని..పట్టభద్రులను నేరుగా కలిసి కరపత్రం అందజేసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది…

వీరి వెంట కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ అడ్డాల శ్రీను , జనసేన పార్టీ మండల కో-కన్వీనర్ ముక్కా రాంబాబు , జనసేన నాయకులు అడపా శ్రీను , అల్లం బాపిరాజు , మామిడి నాగార్జున , బుజ్జి , దోసపాటి అయోధ్య , గండి విజయ్ కుమార్ , చిక్కిరెడ్డి మల్లిఖార్జున , కట్టా వీరసూరి , బాలిన రామకృష్ణ , జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ఆయా గ్రామాల ప్రజలు, పట్టభద్రులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app