SAKSHITHA NEWS

ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను బయోమెట్రిక్ నవీకరించుకోవాలని సూచించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

*సాక్షిత వనపర్తి : *
ఆధార్‌ కార్డు అన్ని సేవలకు కీలకమైనదిగా మారిందని, ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉండి, తమ వివరాలు, బయోమెట్రిక్‌ను నవీకరించుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తెలిపారు.

    సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో యు ఐ డి ఏ ఐ అసిస్టెంట్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు వెబ్ ఎక్స్ ద్వారా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు,పౌర సేవలు పొందాలంటే ఆధార్‌ అప్‌ డేట్‌ తప్పనిసరి అని అన్నారు.  ఆధార్‌ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు. పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులందరికి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

5 నుంచి 15 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని సూచించారు. ఆధార్ కార్డులో చిన్న మార్పులకు నివాస ధృవపత్రం సరిపోతుందని, అయితే జన్మతేదీ సవరణకు తప్పనిసరిగా జన్మ ధృవపత్రం అవసరం అని స్పష్టం చేశారు. జన్మ ధృవపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్లు మరియు ఆర్డీవో కు ఆదేశించారు. విద్యార్థులు అపార్ కార్డు కోసం నమోదు చేసుకునే ముందు, వారి ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ,నీట్ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ కోసం మెగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఈ నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఆధార్ సేవా కేంద్రాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ డిస్ట్రిక్ మేనేజర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, యు ఐ డి ఏ ఐ అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, ఈడియం విజయ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app