వరద బాధితులకు సహాయం చేయటానికి అందరూ ముందుకు రావాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చిన వరదలలో ముంపుకు గురై నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా ముందుకు రావలసిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. థంసలాపురం కాలనీలో మున్నేరు వరదకు నిరాశ్రయులైన వారికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటరామాంజనేయులు అతని సోదరుడు తోట నాగకృష్ణ వారి స్నేహితులు రెడ్డి మల్లేశ్వరి, సాంబశివరావు, రెడ్డి రవి, రుద్రాక్షల సురేష్, చింతల గోపి, చిన్నిరాల విజయ రాంబాబుల సహకారంతో ఏర్పాటుచేసిన 200 దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు సాటి ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వమే సాయం చేయాలని చూస్తూ ఊరుకోకుండా ముందుకు వచ్చి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజలపై యువతపై ఉందన్నారు. కేవలం ఆర్థిక సాయం చేస్తేనే సహాయం కాదని సేవ చేయటం కూడా సహాయం కిందకే వస్తుందన్నారు. గత నాలుగు రోజులుగా సాటి ప్రజలను ఆదుకోవటానికి ఖమ్మం జిల్లా ప్రజలు పడుతున్న తాపత్రయాన్ని తాను చూస్తున్నానన్నారు. దంసలాపురం కాలనీలో చివరి భాగం పూర్తిగా దెబ్బతిన్నదని ఇక్కడ ప్రజలను ఆదుకోవటానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటరామాంజనేయులు అతని సోదరుడు తోట నాగకృష్ణ వారి స్నేహితులు రెడ్డి మల్లేశ్వరి, సాంబశివరావు, రెడ్డి రవి, రుద్రాక్షల సురేష్,చింతల గోపి, చిన్నిరాల విజయ రాంబాబులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో తోట రామాంజనేయులు, తోట నాగకృష్ణ, మత్తలా సతీష్, కనతాల నరసింహ రావు, బొమ్మిశెట్టి రమేష్, కొండా లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.