SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేయాలి : ఎమెల్సీ శంభీపూర్ రాజు …

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ కార్పొరేషన్ కౌన్సిల్ సభ్యుల పదవి కాలం ముగియడంతో శంభీపూర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసారి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహాయ సహకారాలతో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కి వందల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎమెల్సీ మాట్లాడుతూ పదివి ఉన్నా లేకున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలిపారు. అభివృద్ధి అనేది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదని మనం చేసిన పనిని ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకుంటారని తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app