సమర్థవంతంగా సంక్షేమ పథకాల అమలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ధారూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.2,10,24,360/- (రూపాయలు రెండుకోట్ల పది లక్షల ఇరవైనాలుగువేల మూడువందలఅరవై) విలువ గల 210 కల్యాణలక్ష్మి / షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
◆ దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎల్లవేళలా ప్రజాసంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ సార్ అన్నారు.
◆ ధారూర్ ఒక్క మండలానికే ఒకేసారి 210 కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కులు మంజూరు కావడం శుభసూచికం అని, ఇదొక పండుగ వాతావరణం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

