పోలీస్ స్టేషన్ లో డిఎస్పి జగదీష్ తనిఖీలు
పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించిన డిఎస్పి
మండలం ప్రజల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో పోలీసులు ముందుండాలని గురజాల డి.ఎస్.పి జగదీష్ అన్నారు. బుధవారం కారంపూడి మండల పోలీస్ స్టేషన్‌లో డి.ఎస్.పి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లోని పలు కేసుల పెండింగ్ లో ఉన్న రికార్డులను,లాక్ అప్ లను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్సై వాసుకు ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించి సీజ్ చేసిన వాహనాల గురించి ఎస్సై వాసును డి.ఎస్.పి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి జగదీష్ మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్‌కి వచ్చే వారితో మర్యాదగా మెలాగాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సర్కిల్ సీఐ టీ.వీ శ్రీనివాసరావు , కారంపూడి ఎస్సై వాసు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.