మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్

Spread the love

మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, గిరిజన గురుకుల బాలికల పాఠశాల స్థలాన్ని, ఆర్తి గార్డెన్స్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.


సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ రూపు రేఖలు మారాయి.
ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది.
మహబూబాబాద్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది.
మహబూబాబాద్ జిల్లా నిరుపేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరబోతుంది.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పరిశీలించాం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
గిరిజన గురుకుల (బాలికల) పాఠశాలను రామచంద్రపురం కాలనీలో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.
రాష్ట్రంలోనే మొదటి రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు ఇచ్చిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు.

ఉస్మానియా, కాకతీయ, జెఎన్టియు యూనివర్సిటీ అధికారులు ఈ స్థలాన్ని చూసి ఎంపిక చేయడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా నాలుగు వైపుల అభివృద్ధి జరుగుతుంది.
ఈ కార్యక్రమంలోమంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page