SAKSHITHA NEWS

రక్తదానం ప్రాణదానం తో సమానం: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం నందు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత పాల్గొని వారి రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. పోలీసుల త్యాగాలు బలిదానాలను ప్రజలు గుర్తించాలని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు. రక్తదానం ప్రాణదానమని ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర సమయంలో ఎందరో రక్తం అందగా ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి రాకుండా అవసరమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రి సిబ్బంది పాల్గొని రక్త దాతల నుండి రక్తాన్ని సేకరించారు. అలాగే తలసేమియా పిల్లలకు ఉపయోగపడే విధంగా తలసేమియా పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ వారు కూడా దాతల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ శిబిరం నందు యువత, పోలీసు సిబ్బంది కలిసి 200 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వర రావు, ఏ ఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహా చారి, సూర్యాపేట డీఎస్పీ రవి, ఆర్ఐ నారాయణ రాజు, సీఐ లు రాజశేఖర్, సురేందర్ రెడ్డి, శ్రీను, రఘువీర్ రెడ్డి, ఎస్ఐ లు, ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS