
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
గద్వాల ): ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన సందర్బంగా బుధవారం పరీక్షా కేంద్రాలుగా ఉన్న జిల్లా కేంద్రం లోని జ్ఞాన ప్రభ, శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల లను జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు సందర్శించారు.అందులో భాగంగానే ఆయా కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు , విద్యార్ధుల హాజరు తదితర అంశాలను పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ఎస్పికి వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి భద్రత ఏర్పాట్లు, పరీక్షా అనంతరం ఎస్కార్ట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు.
ఈ సందర్శన లో డి .ఎస్పి శ్రీ వై మోగిలయ్య, సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు,గద్వాల్ సిఐ టి.శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app