ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించిన .జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

Spread the love

District SP Siddharth Kaushal inspected the preliminary written examination centers

ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించిన .జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
సాక్షిత కర్నూలు జిల్లా

జనవరి 22 ఆదివారం జరగబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు .పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందే అభ్యర్దులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జనవరి 22 వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్(సివిల్, ఎపిఎస్పీ) అభ్యర్ధులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగబోతున్న సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గురువారం పరీక్షల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు.

భద్రతా ఏర్పాట్ల లో భాగంగా సిసి కెమెరాలను పరిశీలించారు. కర్నూలులోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసఫ్ కళాశాల , పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించవలసిన నిబంధనలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మాట్లాడారు. పరీక్ష రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.


పరీక్షా కేంద్రాల వద్ద మాల్ ప్రాక్టీస్, కాఫీయింగ్, అవాంఛనీయ ఘటనలకు, అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగబోతున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రాల కళాశాల యాజామాన్యాలతో మాట్లాడి, పరీక్ష కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని నియమించి భద్రతా చర్యల ఏర్పాట్లను ముమ్మరం చేస్తామన్నారు.

ఈనెల 22 వ తేదీన ఉదయం 10 గంటల నుండీ మధ్యాహ్నాం ఒంటి గంట వరకు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరి పరీక్ష ఉంటుందన్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. నంద్యాల జిల్లా కాకుండా కర్నూలు జిల్లాలోనే చెందిన 22 వేల 630 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.( పురుష అభ్యర్థులు 18,117 , మహిళా అభ్యర్ధులు 4,513 పరీక్ష కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించనున్నాయన్నారు.

ఈ పరీక్ష 22.01.2023 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం 01 గంట వరకు ఉంటుందన్నారు. అభ్యర్దులను పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటల నుండే పరీక్ష హాలులోకి అనుమతిస్తారన్నారు.


అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నులు మాత్రమే తీసుకురావాలన్నారు. పరీక్షకు వచ్చే యువతీ, యువకులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, ఇతర వస్తువులు పరీక్ష హాలుకు అనుమతించబోమన్నారు.
ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకునేవిధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీలు కె.వి మహేష్, యుగంధర్ బాబు, రీజనల్ కో ఆర్డినేటర్ పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి, కర్నూలు టు టౌన్ సిఐ శ్రీనివాసులు, ఎస్సై ఖాజావళి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page