SAKSHITHA NEWS

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి ……. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రజిని

సాక్షిత వనపర్తి: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి. రజని అన్నారు వనపర్తి జిల్లాలోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని సఖి కేంద్రంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బాల కార్మికుల చట్టం బాల్య వివాహాల చట్టం మోటార్ వెహికల్ చట్టం క్రైమ్ గురించి వివరించారు. కార్యక్రమంలో సఖి కేంద్రం ఇంచార్జ్ కవిత, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉత్తరయ్య ఉమెన్ హబ్ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు.