SAKSHITHA NEWS

విద్యార్థుల చదువులకు ఆటంకం కలిపిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ప్రజావాణి లో పిర్యాదు చేసిన ………………బంజారా గిరిజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్

సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని రాజాపేట దగ్గర ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లోని విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేపిస్తు ప్రిన్సిపల్ స్కావెంజర్లను తన సొంత పని కోసం వినియోగించుకుంటున్న ప్రిన్సిపాల్ తిరుపతయ్య గౌడ్ విద్యార్థుల చదువులకు ఆటంకం కలిపిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ను ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్లు బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ కోరినట్లు తెలిపారు విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారంగా మెనూ పాటించకుండా నీళ్ల చారు పోస్తున్న ప్రిన్సిపాల్ సిబ్బందిపై వెంటనేచర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సమస్యలు వస్తే ఆటోలో తీసుకుపోవడానికి కూడా విద్యార్థుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు డబ్బులు ఇవ్వకపోతే హాస్పిటలకు తీసుకెళ్లని ప్రిన్సిపల్ విద్యార్థులతో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ నెలనెలకు జీతాలు వస్తే చాలు విద్యార్థులతో తనకుసంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరిననట్లు బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్ నాయక్ మోహన్ నాయక్ చింటూ నాయక్ కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app