గిరిజన సంఘాల నిరాసన

Spread the love

గిరిజన సంఘాల నిరాసన

సాక్షిత నంద్యాల జిల్లా డోన్

పట్టణంలోనిన్నటి దినాన అసెంబ్లీలో ఎస్టీ జాబితాలోకి బీసీ కులాలను చేర్చే ప్రక్రియపై సీఎం చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న ఎస్టీ సంఘ నాయకులు. ఈ ప్రకటనపై ఈరోజు డోన్ పట్టణంలో పాత బస్టాండ్ గాంధీ సర్కిల్ వద్ద ఎస్టి కులాలకు చెందిన నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, వై హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం గోపాల్, ఎన్.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు శివశంకర్, వై హెచ్ పి ఎస్ డోన్ తాలూకా కార్యదర్శి సి రామయ్య మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపరిసంస్కరణమని లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు, మరియు 2024 ఎలక్షన్ లో ఎలాగైనా గెలవాలని సీఎం జగన్ ఇటువంటి అనైతిక ప్రకటనలు చేయడం సరికాదని, పక్క రాష్ట్రాలలో తెలంగాణలో గిరిజనులకు 12 శాతం, కర్ణాటకలో 20 శాతం రిజర్వేషన్ అక్కడి ప్రభుత్వాలు కల్పించాయి.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 6 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉందని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మీరు అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఆరు శాతం గిరిజనులకు అన్యాయం చేయడం సమర్థసం కాదని, భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఆరు శాతం మాత్రమే ఉన్నారు. అటువంటి ఎస్టీలోకి బీసీలలోనే అధిక సంఖ్యలో ఉన్న బోయ ,వాల్మీకి వంటి కులాలను చేరిస్తే తమ జాతి ఉనికినే కోల్పోవాల్సి వస్తుందని ఎస్టీ సంఘం నాయకులు వాపోయారు. రాష్ట్ర మొత్తంలో మీ కుటుంబం వెంట పులివెందులలో మీకు అండగా ఉండేది గిరిజనులు మాత్రమే అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదని వారు తెలిపారు. మైదాన ప్రాంతంలో మాత్రమే రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం, ఈ ప్రకటనకి వ్యతిరేకంగా రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న గిరిజన మంత్రులు ,ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని, మీరు చేసిన ఈ తీర్మానాన్ని న్యాయపరంగా కూడా ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా సిద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఉన్నారని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంకటేశు, శేఖర్, కుమారు, రాముడు, సేవ నాయక్, నాగరాజు గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page