30 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి డయాబెటిస్ స్క్రీనింగ్ వేగంగా పూర్తి చేయాలి…………. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ..
సాక్షిత వనపర్తి
మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 5 పీహెచ్సిల పరిధిలో 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డయాబేటిస్ స్క్రీనింగ్ వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఆదేశించారు.
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ తో కలిసి మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ మధుమేహ లో భాగంగా ఎంపిక చేసిన 5 పీహెచ్సిల పరిధిలో 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డయాబేటిస్ స్క్రీనింగ్ చేపట్టాలన్నారు. స్క్రీనింగ్ చేసేటప్పుడే వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసి అభా ( ఆయుష్మాన్ భారత్) ఐడి జనరేట్ చేయాలన్నారు. ఆశాలు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, మెడికల్ ఆఫీసర్లు అందరూ సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.
ఇప్పటివరకు ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు అని అదనపు కలెక్టర్ ప్రశ్నించగా, 29 వేల మందికి పూర్తయిందని అధికారులు సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 31 లోపు అందరికీ పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
సమావేశంలో వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.