SAKSHITHA NEWS

వసంత పంచమి వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు..

హెలికాప్టర్లతో పూలవర్షం

వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 8 గంటలకు వరకు దాదాపు 62 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మౌనీ అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటవంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app