SAKSHITHA NEWS

పెంచలకోన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న దారపనేని, బైరెడ్డి

కనిగిరి సాక్షిత :
కనిగిరి నియోజకవర్గం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి మంగళవారం, శ్రీ సూర్య జయంతి రథసప్తమి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దారపనేని, బైరెడ్డి మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ పండుగలకు, పర్వదినాలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిధి రోజున లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయని, సూర్యుడు రధాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకున్న రోజు రథసప్తమి అని, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వలన పాపాలు విముక్త మవుతాయని, అనారోగ్యాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజలకు అపారమైన నమ్మకమని దారపనేని, బైరెడ్డి పేర్కొన్నారు. టి ఎన్ ఎస్ వి ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి పోకనాయుడు బాబు, దారపనేని రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు, యర సింగ్ రాయుడు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app