బుగ్గన అనుచరులు భూకబ్జాల ఆపాలని .సిపిఐ డిమాండ్

Spread the love

బుగ్గన అనుచరులు భూకబ్జాల ఆపాలని .సిపిఐ డిమాండ్

సాక్షిత నంద్యాల జిల్లా డోన్

డోన్ పట్టణంలోని కళ్యాణ్ ఎస్టేట్లో గుడికి బడికి పార్క్ కోసం కేటాయించిన స్థలం మంత్రి బుగ్గన అనుచరులు అక్రమంగా ఆక్రమించుకొని ప్రభుత్వం ద్వారా పట్టాలు సాధించుకొని నిర్మించుకుంటున్న దానిని సిపిఐ బృందం పరిశీలన చేశారు.ఈసందర్భంగా డోన్ పట్టణ సీపీఐ కార్యదర్శి బి. నారాయణ మాట్లాడుతూ డోన్ పట్టణంలోని కళ్యాణి స్టేట్ లోని సర్వేనెంబర్ 380/a1ab.c.383/2.3.4.385/2a.2b.2c గల 62 సెంట్లు స్థలమును అధికారుల అండతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ మెంబర్స్ ఆక్రమించి పునాదులు నిర్మించిన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులువారికి వతస్తు పలుకుతూ, పాత తాసిల్దార్ తో ఏకంగా పట్టాలు పంపిణీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యం పుష్కలంగా కనిపిస్తుందని ఆయన ఎద్దేవ చేశారు. ఎటువంటి స్థలము లేని నిరుపేదల కు పట్టాలు పంపించవలసిన కౌన్సిలర్లే ప్రభుత్వ భూములపై గద్దలా వాడుతున్నారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అధికారులు కోరారు.వంక పోరంబోకు స్థలాలను మున్సిపల్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాదారులు ఆక్రమించుకొని ఒక సెంటు దాదాపుగా 10 లక్షలు కు అమ్ముకొని కోట్ల లో వ్యాపారం చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా మున్సిపల్ స్తలలాలను ఆక్రమిస్తున్న ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ ను వెంటనే కళ్యాణ్ ఎస్టేట్ లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC డోన్ నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్,AIYF జిల్లా అధ్యక్షుడు రణత్ యాదవ్,AISF నాయకులు ప్రతాప్, రామ్ మోహన్, మహిళా సమాఖ్య నాయకురాలు లక్ష్మీదేవీ, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page