
మల్లన్న హుండీల లెక్కింపు
సాక్షిత రాజు శ్రీశైలం
17.02.2025 జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,18,94,668/–నగదు రాబడిగా లభించింది.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 17 రోజులలో (31.012025 నుండి 16.02.2025 వరకు) సమర్పించడం జరిగింది.
ఈ నగదుతో పాటు 152 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 2కేజీల 150 గ్రాముల వెండి లభించాయి.అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 423, మలేషియా రింగిట్స్ 108, యూకే ఫౌండ్స్ – 20, సింగపూర్ డాలర్లు -10, జింబాబే క్వచ్చాస్ 120, కెనడా డాలర్లు – 50, సౌదీ అరేబియా రియాల్స్ 20, థాయిలాండ్ భట్స్ – 20 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app