అభివృద్ధి పనుల స్థితిగతుల పై కార్పొరేటర్లు

Spread the love
Corporators on status of development works

సాక్షిత : మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పనుల స్థితిగతుల పై కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ ఉప్పలపాటి శ్రీకాంత్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా, GHMC ఇంజనీరింగ్ విభాగము, జలమండలి ,టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ మరియు స్ట్రీట్ లైట్స్ విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధి చేపట్టే దిశగా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది అని , అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పనుల స్థితిగతి మరియు పనుల పురోగతి మరియు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న


రోడ్లు పునరుద్ధరించడం కొరకు ప్రతిపాదించిన
పనులు , కొత్త ప్రతిపాదనలు మంజూరైన పనులు మరియు శంకుస్థాపనకు సిద్ధమైనవి వాటి సమగ్ర సమాచారం పై సమీక్షించడం జరిగినది అని,గుల్ మోహర్ పార్క్ ప్రహరీ గోడ నిర్మాణము వెంటనే చేపట్టాలని, డ్రైనేజి వ్యవస్థ పై సమీక్షా జరపడం జరిగినది అని STP లకు అనుసంధానం చేసే ఔట్ లెట్ ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ,ఇంజనీరింగ్, జలమండలి, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని

, రోడ్ కట్టింగ్ సమయంలో మంచి నీటి పైప్ లైన్ ,డ్రైనేజి పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్ల ను వెంటనే మరమత్తులు చేయాలని, UGD, రోడ్లు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , మంచి నీటి సరఫరా వ్యవస్థ ను సరిగ్గా నిర్వహించాలని, రోడ్ల పనులలో వేగం పెంచాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి పై సమీక్షా జరపడం జరిగినది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, పటేల్ చెరువు, గంగారాం చెరువు పనుల పురోగతి పై చర్చించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ముఖ్యంగా విద్యుత్ విభాగం అధికారులతో మాట్లాడుతూ కాలనీ లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, కరెంట్ సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చూడలని, కరెంట్ తీగలు కిందికి వేలాడకుండా చూడలని,ప్రమాదకరమైన స్తంభాల చోట మరియు అవసరమైన చోట కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, ట్రన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని , గోకుల్ ప్లాట్స్ లో ట్రాన్స్ఫార్మర్ల ను త్వరితగతిన ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని,
మరియు


విధి దీపాల నిర్వహణ పై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడలని, కాలనీ లలో వీధి దీపాలు వెలుగని చోట వెంటనే పునరుద్ధరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని , స్మశాన వాటికల అభివృద్ధి పనులు మందకొండిగా ఉన్నాయి అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు ,

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు GHMC SE శంకర్ నాయక్ , EE శ్రీనివాస్ , EE శ్రీకాంతిని ,DE సురేష్, DE రమేష్,DE స్రవంతి AEలు సునీల్, ప్రశాంత్,శివ ప్రసాద్,,ప్రతాప్, జగదీష్,AMOH కార్తిక్


జలమండలి అధికారులు GM రాజశేఖర్ ,DGM నాగప్రియ , మేనేజర్లు సుబ్రమణ్యం ,యాదయ్య, సందీప్,నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సాయి చరిత, సునీత, మానస ACP సంపత్, స్ట్రీట్ లైట్స్ ఈ ఈ ఇంద్రదీప్ , DE సునీల్, AE రామ్మోహన్ ,రాజశేఖర్ మరియు విద్యుత్ విభాగం అధికారులు DE, ADE , AE లు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page