సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
*సాక్షిత : *124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయానగర్ కాలనీలోని కమాన్ టి జంక్షన్ వద్ద పదహారు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విష్ణు, రాజ్యలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
గంధం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS గంధం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనిహెచ్ఎంటి మెయిన్ రోడ్డు దర్గాలో సయ్యద్ ఖాజా భాయ్ ఆధ్వర్యంలో జరిగిన గంధం మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర…
కేడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తు.. అధినేత ఆర్డర్‌తో కదిలిన కేటీఆర్, హరీశ్
SAKSHITHA NEWS కేడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తు.. అధినేత ఆర్డర్‌తో కదిలిన కేటీఆర్, హరీశ్..!! గులాబీ పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. త్వరలో పాదయాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలి?.. ఎక్కడ ముగించాలనేదానిపై ప్రాథమికంగా అంచనాకు…