0 0
Spread the love

Read Time:5 Minute, 41 Second

కరోనా కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ లు కార్మికులను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని చెప్పారు. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్ లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల రెమ్యునరేషన్ కు సంబంధించి మూడు సంవత్సరాలపాటు ఒప్పందం ఉంటుందని, కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసినందున తమ రెమ్యునరేషన్ పెంచాలని, ఇతర డిమాండ్ ల పై సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయాన్ని మంత్రి వివరించారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదు…..తలసాని

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. BJP నేతలు తమ వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని, మోడీ, అమిత్ షా లు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో చేసిన విధంగానే మహారాష్ట్ర లో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. మహారాష్ట్ర లోని ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతోనే MLA లను ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదు… బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదనే విషయాన్ని BJP నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని, మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని అన్నారు. BJP సమావేశాలు హైదరాబాదు లో నిర్వహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని, బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు లో జరిగిన అభివృద్దిని చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ దేశానికి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే కేంద్రంలోని BJP ప్రభుత్వం హింసను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే BJP నేతలు ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. మీ వైఖరి, విధానాలతో అనేకమంది యువకుల జీవితాలు అంధకారమయంగా మారాయని విమర్శించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page