SAKSHITHA NEWS

ప్రభుత్వ పథకాలపై సమన్వయసమావేశం లో హాజరైన జిల్లా ఇన్చార్జి, జిల్లా మంత్రి , ఉమ్మడి ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలు సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ,గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మరియు ఎమ్మెల్సీ లు, అన్ని జిల్లాల కలెక్టర్లతో అధికారులతో హాజరయ్యారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ……

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భూ నిర్వాసితులకు ఎక్కువ అవకాశం కల్పించాలి. మా ప్రాంతంలో ప్రాజెక్టు లో భూ నిర్వాసితులు చాలామంది ఇళ్లను భూములు లను కోల్పోయి ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత కల్పించాలని మంత్రివర్యులు కోరారు.

ఇన్చార్జి మంత్రులు మాట్లాడుతు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ప్రతిష్టాత్మకంగా జనవరి 26 తేదీ నాడు నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఈ పథకాలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకువెళ్లాలి దీనిలో కీలకమైన పాత్రగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలో తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు.

జిల్లా మంత్రివర్యులు మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి *రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను జనవరి 26 తేదీ నాడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతులకు, రైతు భరోసా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం గ్రామసభలను ఏర్పాటు చేసి అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలి అదేవిధంగా కొన్ని గ్రామాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని వెంటనే అధికారులు పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలలో అవకాశం కలిపించి ఇందిరమ్మ ఇల్లు లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కృషి చేయాలి అని కోరారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు భగీరథ వంశీ, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.