0 0
Spread the love

Read Time:2 Minute, 49 Second

సమన్వయంతో అభివృద్ధికి పని చేస్తున్నాము – కమిషనర్ అనుపమ అంజలి

తిరుపతి

తిరుపతి అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకెలుతున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సి.డి.ఎం.ఏ ప్రవీణ్ కుమార్ నిర్వహణలో విజయవాడ నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి నుండి పాల్గొన్న కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ సచివాలయాలను నిరంతరం సందర్శించి వారి యొక్క హాజరు నమోదు, ప్రజలకి అందిస్తున్న సేవలపై పర్యవేక్షిస్తూ, పెండింగ్ సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నామన్నారు. జగనన్నా ఇళ్ళ నిర్మాణాల గురించి వివరిస్తూ, లబ్ధిదారులకు చాలా వరకు జియో ట్యాగింగ్ పూర్తి చేసామని, ఎన్నిక చేసిన ఇళ్ళ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, బేస్ మెంట్ పనులు పూర్తి చేసి, నిర్మాణాల కొరకు పని చేస్తున్నమని వివరించారు. అదేవిధంగ క్లాప్ గురించి మాట్లాడారు, స్వచ్చ సర్వేక్షణలో తిరుపతిని దేశంలో ఆదర్శంగ తీసుకెల్లెందుకు కృషి చేయడం జరుగుతున్నదన్నారు. అదేవిధంగా ఉదయం మెడికల్ కాలేజ్ సర్కిల్, కనకభూషం లే అవుట్, దేవేంధ్ర థియేటర్ ప్రాంతాల్లో, వివి మహాల్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కాలువలను కార్పొరేటర్లు నరేంధ్రనాధ్, దూది కుమారి, నాయకులు తిరుత్తణి వేణుగోపాల్ సమక్షంలో పరిశీలించి, సీల్ట్ తీసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు దేవిక, గోమతి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, షణ్ముగం, వెటర్నరీ డాక్టర్ రవికాంత్, శానిటరి సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page