ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Spread the love

Control of crime with the cooperation of the people

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ
వైరా పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణలో వుంటాయని అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి అన్నారు.
వైరా పోలీస్ స్టేషన్ ను


అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి సందర్శించారు. గురువారం ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి విచ్చేసిన అడిషనల్ డీజీపీ ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ స్వాగతం పలుకుతూ పుష్పగుఛ్చం అందజేశారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ తో కలసి వైరా పోలీస్ స్టేషన్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. కేసుల వివరాలు,

శాంతి భద్రతల ఆంశలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ…వైరా డివిజన్ పరిధిలో నేరాలు అదుపులో వున్నాయని అన్నారు. అదేవిధంగా గతంలో కంటే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించడంలో ప్రజలు పూర్తి సహకారం అందిచారని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది చక్కని పనితీరుతో నేరాల సంఖ్య క్రమంగా తగ్గించారని అన్నారు.

భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాదాలు జరిగే ప్రదేశాలను
సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా విధినిర్వహణలో రాణించడంతో పాటు


ప్రజలకు మరింత మెరుగైన సేవలందించించిన బ్లూకోల్డ్స్ కానిస్టేబుల్ బూక్య బాల్య ను అభినందిస్తూ.. సర్టిఫికేట్ అందజేశారు.


ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో వైరా ఏసిపీ రహెమాన్, సిఐ సురేష్ కుమార్, మధిర సిఐ మురళీ, ఎస్సైలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page