కుశస్థలి నదిపై ఒహ్వెర్ బ్రిడ్జి నిర్మించండి

Spread the love

Construct the Over Bridge over the Kusasthali river

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి
కుశస్థలి నదిపై ఒహ్వెర్ బ్రిడ్జి నిర్మించండి ……….. సీ పి ఐ పార్టీ నగిరి నియోజకవర్గం కార్యదర్శి కోదండ య్య, పట్టణ కార్యదర్శి వేలన్ భాష డిమాండ్

     ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కుశస్థలి నది పైన ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ పార్టీ నాయకులు భాష ఆధ్వర్యంలో  ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో వర్షాలు ఎక్కువ వచ్చినందున వరద తాకిడికి కుశస్థలి నది పైన ఉన్న రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు సమస్యను పరిష్కరించలేదు. గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఓవర్ బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.
    తిరుపతి నుంచి చెన్నై , కాంచీపురం ద్వారా ప్రధాన రహదారి గా ఉన్నది. అనునిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గంలో రవాణా జరుగుతుంది వందలాది బస్సులు ఈ రోడ్డు ద్వారా నడుస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామస్తులు విద్యార్థులందరూ ఈ రహదారిపై నడుస్తున్నారు, రోడ్డు డ్యామేజ్ అయ్యి సుమారు 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు వరకు కూడా ఆర్అండ్బి అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు రోడ్డు వేయలేదు, కావున ఇప్పటికైనా ఈ రోడ్డు పైన బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
 స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నా శ్రీమతి ఆర్.కె. రోజా సెల్వమణి గారు ఈ రోడ్డు నిర్మించడానికి బాధ్యత తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు
  ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వేలన్ నాయకులు భాష శేఖరు నందకుమార్ నరసింహ చాంద్ భాషా  ప్రభాకర్  కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page