SAKSHITHA NEWS

కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని కృషి కాలనీ సాయి బాబా నగర్ నందు కమ్యూనిటీ హాల్ కొరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా 10లక్షల మంజూరు అయిన సందర్బంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి పనులను ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .అనంతరం కృషి కాలనీ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జి హన్మంతన్నకు శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ మాజిద్ పాషా, రాజి రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆనంద్, అంజి రెడ్డి, నర్స గౌడ్, సత్తి రెడ్డి, శాంతయ్య స్వామి, ప్రభాకర్, రామ్ రెడ్డి, మురళి, గోపాల్, సిద్ది రాములు, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరి కిరణ్, ద్వారంపూడి నాగి రెడ్డి, నగేష్ రెడ్డి, గురువ రెడ్డి, కరణ్, రాజు చారి, యూసుఫ్, నాగేంద్ర, శ్యామ్ మరియు తదితరులు పాల్గొన్నారు .