SAKSHITHA NEWS

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

అమరావతీ :

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’అని ఆయన పేర్కొన్నారు.


SAKSHITHA NEWS