SAKSHITHA NEWS

వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

టేకుమట్ల మండలంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన వసంత పంచమి వేడుకలకు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్
కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన చిన్నారుల అక్షరాభ్యాసం, సరస్వతి పూజ,హోమ కార్యక్రమాలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ,పాఠశాల యజమాన్యం భారతీయ సంస్కృతిక సాంప్రదాయాలు పాటిస్తూ,చిన్నపిల్లల సమక్షంలో ఇలా ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.

విద్యార్థి దశలో విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడం వల్ల భవిష్యత్ తరాలకు అందించటానికి ఆస్కారం ఉంటుందన్నారు.ప్రస్తుత సమాజంలో సాంకేతిక మోజులో పడి మన సంప్రదాయాలను మరిచిపోతున్నారని,వాటిని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఈ సందర్భంగా తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు పాఠశాల కరస్పాండెంట్ మియాపూర్ హరీష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కత్తి సంపత్ గౌడ్, కొయ్యల చిరంజీవి,తోట గట్టయ్య, గునిగంటి మహేందర్ గౌడ్,వంగ నరేష్,వైనాల యశ్వంత్,పోలు దాసరి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app