SAKSHITHA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలతో కలిసి వారి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు.. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

మన రాష్ట్రాన్ని ఆధునిక రంగంలో అగ్రగామిగా నిలుపెందుకు మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా కృషి చేస్తున్నారని అన్నారు..

ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులని ఆకర్శించి హైదరాబాద్ మహా నగరాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చడమే మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ,ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లక్ష్యం అన్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందాన్నారు.. ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు..

నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, నాయకులు,సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app