
సి.ఐ బి. సుబ్బ నాయడుకు ఘనసత్కారం.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ.
చిలకలూరిపేట :మండల గ్రామీణ సీఐ బి. సుబ్బ నాయుడుకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. ఈ మేరకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం సి.ఐ కి హృదయపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర -2025వ క్యాలెండర్ ను సి.ఐ చేతుల మీద ఆవిష్కరణ చేయించడం జరిగింది.సి.ఐ కి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గ్రామీణ సీ.ఐ బి. సుబ్బనాయుడికి, పట్టణ సి.ఐ పి.రమేష్ ,గ్రామీణ ఎస్సైగా అనిల్ కుమార్,కు ఎస్పీ శ్రీనివాసరావు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డులను ప్రధానం చేశారని, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
