SAKSHITHA NEWS

ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించిన కాంప్లెక్స్ హెడ్మాస్టర్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ పరిధిలోని సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డు రాయినిగూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాలను కాంప్లెక్స్ హెడ్మాస్టర్ దైద పాపయ్య సందర్శించారు. పాఠశాల విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాలుగు, రెండవ తరగతుల్లో ఉపాద్యాయుల విద్యాబోధనను పరిశీలించి విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉపాద్యాయులు బోధించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం చేసి, పిల్లలకు కోడిగుడ్లు మెనూ ప్రకారం పెట్టడంతో పాటు భోజనం కూడా రుచికరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ,ఉపాద్యాయుల బోధనను పరిశీలించి విద్యార్థుల ఉన్నత భవిషత్ కొరకు ఉపాద్యాయులు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app